Sun Dec 22 2024 23:58:13 GMT+0000 (Coordinated Universal Time)
Chennai : ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్లు హతం
చెన్నైలో ఈరోజు తెల్లవారు జామున ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు కాల్చి చంపేశారు
చెన్నైలో ఈరోజు తెల్లవారు జామున ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు కాల్చి చంపేశారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని కాంచీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంచీపురం రైల్వే వంతెన వద్ద పోలీసు సిబ్బందిపై రౌడీషీటర్లు దాడికి యత్నించగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈకాల్పుల్లో రౌడీషీటర్లు రఘువరన్, కరుప్పు హసన్ మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు.
హత్య కేసులో నిందితులు...
ఒక హత్య కేసులో వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఒక హత్య కేసులో వీరిద్దరూ నిందితులు. పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా ఎదురుదాడికి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story