Tue Jan 07 2025 02:32:40 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ ..నలుగురు మావోల మృతి
ఛత్తీస్ ఘడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. గత రాత్రి నుంచి మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
ఛత్తీస్ ఘడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. గత రాత్రి నుంచి మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఒక జవాను కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. నారాయణ్ పూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఎదురు కాల్పులు జరిగాయి.
ఒక జవాను కూడా...
దక్సిణ అబుజ్ మాద్ లోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగపడ్డారని, ఎదురు కాల్పులు జరగడంతో తమ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story