Sun Dec 22 2024 21:13:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ములుగు జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు
తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని తెలిసింది. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ అని చెబుతున్నారు. మావోయిస్టులున్నారన్న సమాచారంతో వెదుకుతున్న భద్రతాదళాలకు వారు కన్పించారు.
భద్రతాదళాలపై...
అయితే భద్రతాదళాలపై కాల్పులుకు మావోయిస్టులు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ములుగు చజిల్లా కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఎన్కౌంటర జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని సమాచారం.
Next Story