Sun Dec 22 2024 21:16:35 GMT+0000 (Coordinated Universal Time)
మరో ముగ్గురికి ఈడీ నోటీసులు
హవలా సొమ్మును ఇతర దేశాలకు పంపారని అనుమానిస్తున్న పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది
క్యాసినో వ్యవహారం తెలంగాణలో అనేక మలుపులు తిరుగుతుంది. చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరితో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. ప్రధానంగా హవాలా సొమ్ముపైనే ఈడీ ఎక్కువగా దృష్టి పెట్టింది. రాజకీయ నాయకులే కాకుండా, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చీకోటి ప్రవీణ్ తో టచ్ లో ఉన్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు.
హవలా సొమ్మును...
అయితే హవలా సొమ్మును ఇతర దేశాలకు పంపారని అనుమానిస్తున్న పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ తో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. సోమవారం హాజరు కావాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లేందుకు విమానాలను ఏర్పాటు చేసిన సంపత్ తో పాటు, హవాలా ఆపరేటర్లు వెంకటేష్, రాకేష్ లక కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీరంతా సోమవారం ఈడీ ఎదుటకు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Next Story