Mon Dec 23 2024 06:48:55 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ సీరియస్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోతుగా దర్యాప్లు చేయాలని నిర్ణయించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోతుగా దర్యాప్లు చేయాలని నిర్ణయించింది. గతంలో ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణ పై ఈడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ పై కూడా ఈడీ దృష్టి సారించనుంది. వీరి కాల్ డేటాను మరోసారి పరిశీలించాలని నిర్ణయించింది. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని భావిస్తుంది. ఎక్సైజ్ అధికారుల వ్యవహారశైలిపై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
టోనీ వ్యవహారం కూడా....
టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు టోనీ వ్యవహారంలో కూడా ఈడీ సీరియస్ గానే ఉంది. మనీలాండరింగ్ విషయంపై ఆరా తీస్తుంది. ఈ కేసులో ఉన్న వ్యాపారవేత్తలు, ప్రముఖుల విషయంలోనూ ఈడీ విచారించాలని భావిస్తుంది. వ్యాపారులు హవాలా మార్గంలో నిధుల మళ్లింపుపై ఆరా తీస్తుంది. కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు చేయడంతో మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు చర్చనీయాంశమైంది.
Next Story