Sun Dec 22 2024 21:57:27 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. న్యాయస్థానంలో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. న్యాయస్థానంలో ఈడీ పిటీషన్ దాఖలు చేసింది. 2017 టాలివుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తమకు మొబైల్ పిటీషన్ ఇవ్వాలని ఎక్సైజ్ కోర్టులో ఈరోజు పిటీషన్ దాఖలు చేసింది. 2017లో ఎక్సైజ్ శాఖ 12 మొబైల్ ఫోన్లను సీజ్ చేసింది. ఆ ఫోన్లను ఎక్సైజ్ కోర్టులో ఆ శాఖ సమర్పించింది.
సీజ్ చేసిన ఫోన్లు...
ఇప్పుడు ఆ ఫోన్లు తమకు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్సైజ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఎక్సైజ్ శాఖ కొన్ని ఆధారాలను ఈడీకి ఇచ్చింది. అయితే ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన ఆధారాలు లేవు. వాటికోసం ఈడీ ప్రయత్నాలు చేస్తుంది. 2017 లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్ ను తమకు ఇవ్వాలని కోరుతో ఈడీ పిటీషన్ వేయడం ఈ కేసులో వేగం పెంచడానికేనంటున్నారు.
Next Story