Mon Dec 23 2024 18:34:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రికార్డులు మాయం.. ఈడీకి ఝలక్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తుంది
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తుంది. కానీ ఈడీకి ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2017లో ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు 41 మందిని ఎక్సైజ్ శాఖ విచారించింది. ఈ సందర్భంగా వారి కాల్ డేటాను కూడా రికార్డు చేసింది. అయితే ఈడీ కోరితే ఆడియో, వీడియో రికార్డులు లేవని చెబుతుంది.
ఒరిజినల్ మెటీరియల్...
2017లో విచారణ సందర్భంగా జరిపిన ఆడియో, వీడియో రికార్డులు ఎక్సైజ్ శాఖ వద్ద మాయమయినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా ఈ కేసులో ప్రధాని నిందితుడు కెల్విన్ మొబైల్ ను కూడా ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును లోతుగా విచారించాలని భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమకు ఒరిజినల్ మెటీరియల్ ను అందజేయాలని కోరింది. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.
ట్రయల్ కోర్టులో ఉన్నాయంటూ...
అయితే తాము విచారణలో చేపట్టిన రికార్డులన్నీ ట్రయల్ కోర్టులో ఉన్నాయని తెలిపింది. కోర్టుకు సమర్పించిన వాటిలో కాల్ డేటా లేదని ఈడీ చెబుతుంది. ఎక్సైజ్ శాఖ కావాలనే ఈడీకి కాల్ డేటా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీిరియస్ గా ఉన్నారు. మరోసారి కోర్టును ఆశ్రయించే ఉద్దేశ్యంలో ఉన్నారు. మొత్తం మీద టాలీవుడ్ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎక్సైజ్ శాఖ మధ్య చిచ్చు పెట్టింది.
Next Story