Mon Dec 23 2024 06:16:27 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ సీరియస్
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ సీరియస్ గా ఉంది. ఎక్సైజ్ శాఖ విచారణకు సహకరించడం లేదని చెబుతోంది
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గా ఉంది. ఎక్సైజ్ శాఖ విచారణకు సహకరించడం లేదని చెబుతోంది. న్యాయస్థానం చెప్పినా లెక్క చేయడం లేదని తెలిపింది. ఈ మేరకు కోర్టులో కోర్టు థిక్కరణ పిటీషన్ ను ఈడీ దాఖలు చేసింది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీ తారల చిట్టా ఉందని ఈడీ అనుమానిస్తుంది. దర్యాప్తు వివరాలను అడిగినా ఎక్సైజ్ శాఖ పాటించడం లేదని పేర్కొంది. విచారణ సందర్భంగా రికార్డు చేసిన కాల్ డేటాను కూడా కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించకపోవడాన్ని తప్పుపట్టింది.
సోమవారం విచారణకు....
ఎక్సైజ్ శాఖ విచారించిన 41 మంది కాల్ డేటాతో పాటు వాంగ్మూలాలు ఇవ్వకుండా ఎక్పైజ్ శాఖ తమను ఇబ్బంది పెడుతుందని ఈడీ చెబుతోంది. తాము సేకరించిన ఆధారాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ చెబుతోందని, అందులో వాస్తవం లేదని ఈడీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈడీ వేసిన కోర్టు థిక్కార పిటీషన్ పై సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.
Next Story