Mon Dec 23 2024 06:00:27 GMT+0000 (Coordinated Universal Time)
చికోటి ప్రవీణ్ కు ఈడీ నోటీసులు
చికోటి ప్రవీణ్ కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
చికోటి ప్రవీణ్ కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో కేస్ లో గతంలోను చికోటి ప్రవీణ్ ను విచారించారు. తాజాగా థాయిలాండ్ ఘటన తరువత మరోసారి చికోటి ప్రవీణ్ కు ఈడి నోటీసులు జారీ చేసింది. చికోటి తో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవ రెడ్డి లకు కూడా ఈడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
వచ్చేవారం...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కు ఇప్పటికే సంపత్ హాజరయ్యాడు. మిగిలిన ముగ్గురిని తమ ముందు హాజరు కావాల్సింది గా ఈడీ అధికారులు నోటీసులను జారీ చేశారు. శుక్రవారం హైదరాబాద్ కు చికోటి ప్రవీణ్ రానున్నారు. వచ్చే వారం ఈడీ అధికారులు ముందు హాజరుకానున్నారు.
Next Story