Sun Nov 24 2024 05:28:34 GMT+0000 (Coordinated Universal Time)
కార్వీ సంస్థ ఆస్తులు అటాచ్
కార్వీ ఛైర్మన్ పార్థసారధికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తులతో పాటు కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది
కార్వీ ఛైర్మన్ పార్థసారధికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆయన ఆస్తులతో పాటు కంపెనీకి చెందిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. దేశ వ్యాప్తంగా1984 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కార్వీ సంస్థ 3,520 కోట్లకు మోసం చేసిందని ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల నుంచి క్వారీ సంస్థ 2,800 కోట్ల రుణాలను పొందింది. అలాగే 720 కోట్లను ఈ సంస్థ తమ ఖాతాదారుల షేర్లను ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ కేసులో క్వారీ సంస్థ ఎండీ పార్థసారధిని అరెస్ట్ చేశారు.
అక్షయ గోల్డ్ ఆస్తులతో పాటు...
అక్షయ గోల్డ్ ఆస్తులను అటాచ్ చేసింది. 376 ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ పేరుతో మోసాం చేసింది. దీనిపై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసిదంది. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల ఆస్తుల మోసాలకు ఈ సంస్థ పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.
Next Story