Mon Dec 23 2024 09:17:41 GMT+0000 (Coordinated Universal Time)
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. పెళ్లైన వ్యక్తితో ప్రేమ?
పెళ్లైన వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకున్న జాస్మిన్ తల్లిదండ్రులు జబీబుల్లాను పలుమార్లు హెచ్చరించారు. ఇటీవలే జబీబుల్లా
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరంలో వెలుగుచూసింది. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గన్నవరంలోని సినిమాహాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహమ్మద్ జాస్మిన్ (20)బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఈమెకు గన్నవరానికే చెందిన ఎస్ కే జబీబుల్లా అనే 27 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే జబీబుల్లాకు ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పెళ్లైన వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకున్న జాస్మిన్ తల్లిదండ్రులు జబీబుల్లాను పలుమార్లు హెచ్చరించారు. ఇటీవలే జబీబుల్లా కుటుంబంతో సహా ఇల్లు మారాడు. రెండ్రోజులుగా జాస్మిన్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జూన్ 12 ఉదయం ఫ్యాన్ కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. తమ కుమార్తె చావుకు జబీబుల్లానే కారణమని ఆరోపిస్తూ అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. శారీరకంగా, మాసికంగా జాస్మిన్ ను వేధించాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని జబీబుల్లాను అదుపులోకి తీసుకున్నారు.
Next Story