Tue Mar 18 2025 03:15:37 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో పేలుడు - ముగ్గురు మృతి
తమిళనాడు ధర్మపురి జిల్లాలో టపాసుల తయారీ కేంద్రంలో పేలుుడు సంభవించింది. ముగ్గురు మరణించారు

తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. టాపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ధర్మపురి జిల్లాలో టపాసుల కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. అనుమతి లేకుండా టపాసులను తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు.
కొందరికి గాయాలు...
ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఏం జరిగిందన్న దానిపై స్థానికులను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story