Thu Mar 20 2025 08:30:39 GMT+0000 (Coordinated Universal Time)
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో..

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కర్మాగారంలో 10 మంది కార్మికులున్నట్టు సమాచారం. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది. భారీ పేలుడు ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు.
Next Story