Tue Nov 05 2024 07:56:34 GMT+0000 (Coordinated Universal Time)
తల్లికి కాల్ చేసి మీ అమ్మాయి సెక్స్ రాకెట్ లో దొరికిందన్నారు.. హార్ట్ అటాక్ తో!!
పోలీసుల్లాగా నటిస్తూ తల్లిదండ్రులను బెదిరించే స్కామ్ లు
పోలీసుల్లాగా నటిస్తూ తల్లిదండ్రులను బెదిరించే స్కామ్ లు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. కొందరు తల్లిదండ్రులు భయపడిపోయి స్కామర్లకు భారీగా డబ్బులను ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో అలాంటి కాల్ ఓ మహిళ ప్రాణాలను తీసింది. బెదిరింపు కాల్ ను విని భయపడిపోయిన మహిళ గుండెపోటుతో మృతి చెందింది.
బాధితురాలు మాలతీ వర్మకు సెప్టెంబర్ 30న పోలీసు అధికారిగా నటిస్తున్న వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. మీ కుమార్తెను సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.లక్ష చెల్లించకపోతే ఆమెకు సంబంధించిన అసభ్యకర వీడియోను లీక్ చేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. తన కుమార్తెను ఈ కేసులో ఇరికించకుండా కాపాడేందుకు ఆ మొత్తాన్ని తక్షణమే బదిలీ చేయాలని ఆ మహిళ తన కుమారుడిని కూడా కోరింది. తన తల్లి చెప్పిన వివరాలను విన్న తర్వాత ఆమె కుమారుడు దివ్యాన్షుకు డబ్బు వసూలు చేయడానికి పోలీసు అధికారిగా నటిస్తూ పాకిస్థాన్కు చెందిన ఎవరో కాల్ చేసినట్లు గుర్తించారు.
మొబైల్ నెంబర్ ముందు +92 ప్రిఫిక్స్ ఉందని దివ్యాన్షు గుర్తించి, అది స్కామ్ అని తల్లికి చెప్పాడు. అప్పటికే ఆమె చాలా టెన్షన్ లో ఉంది. కాలేజీలో ఉన్న నా సోదరితో కూడా మాట్లాడించి, తాను బాగానే ఉందని చెప్పించినా కూడా మాలతీ మనసు కుదుటపడలేదు. సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ఆమె అస్వస్థతకు గురైంది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

Next Story