Mon Dec 23 2024 08:02:33 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై దాడి..
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల..
ఏలూరు : ఈ రోజుల్లో ప్రేమించటం.. ఇంట్లో పెద్దలకు ఇష్టమైనా లేకపోయినా పెళ్లి చేసుకోవడం ఎంత మామూలయిందో.. తమను కాదని పెళ్లి చేసుకున్న జంటపై దాడికి పాల్పడటం కూడా అంతే మామూలయింది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ లో మతాంతర వివాహం చేసుకున్న జంటపై యువతి తరపు బంధువులు దాడి చేసి.. యువకుడిని హతమార్చిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోనూ జరిగింది. అయితే.. తృటిలో ప్రాణాపాయం తప్పింది ఆ జంటకు.
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. గత రాత్రి సాంబశివరావు, పావని ఒక రెస్టారెంటులో ఉండగా యువతి తండ్రి, తమ్ముడు ఈ జంటపై కర్రలతో దాడి చేశారు. యువతి తమ్ముడు సాంబశివరావు చెవిని కొరికేశాడు. గాయపడిన ఆ జంట అక్కడి నుంచి తప్పించుకుని ద్వారకా తిరుమల చేరుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమకు యువతి తరపు బంధువుల నుంచి ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సాంబశివరావు, పావనిల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా తమను చంపేస్తామని బెదిరించగా.. ఏసీపీని కలవగా.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారని, ఇప్పుడు మళ్లీ తమను చంపేందుకు వెంటాడుతున్నారని చెప్తున్నారు.
Next Story