Mon Dec 23 2024 04:27:45 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై సామూహిక అత్యాచారం.. 4 నెలల గర్భిణీ అని తేలడంతో..
పదహారేళ్ల మైనర్ బాలికపై సొంత బంధువులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 4 నెలల గర్భం రూపంలో ఈ దారుణం వెలుగుచూసింది.
కంప్యూటర్ యుగంలో చాలా అరాచకాలను చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆడపిల్లలపై అఘాయిత్యాలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. వయసు బేధం లేదు.. వావి వరసలు లేవు. కామ కోరికలను తీర్చుకునేందుకు.. కనిపించిన ఆడపిల్లపై కన్నేసి, వారి జీవితాలను నాశనం చేసిన ఘటనలు కోకొల్లలు. పదహారేళ్ల మైనర్ బాలికపై సొంత బంధువులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వరుసకు అన్నయ్య, పెదనాన్న, అతని స్నేహితులు బాలికపై తరచూ అత్యాచారం చేయగా.. 4 నెలల గర్భం రూపంలో ఈ దారుణం వెలుగుచూసింది.
Also Read : మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని విల్లుపురం, సెంజి సమీపంలో ఈ చంకుప్పానికి చెందిన 16 ఏళ్ల బాలికపై బంధువులే సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికకు ఒక ఏడాది వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో ఆమె కోవై లో ఉన్న శరణాలయంలో ఉంటూ.. ప్రస్తుతం ప్లస్ వన్ చదువుకుంటోంది. సెలవురోజుల్లో సెంజి సమీపంలో ఉన్న ఈచంకుప్పం ప్రాంతంలో ఉన్న తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేది. రెండ్రోజుల క్రితం కూడా అలానే వెళ్లిన విద్యార్థిని.. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె 4 నెలల గర్భిణీ అని తేల్చారు. దాంతో బాలిక జరిగిన విషయాలను బంధువులకు తెలిపింది. మొదట ఆమెకు వరుసకు అన్న అయిన మోహన్ లైంగిక దాడి చేయగా.. ఆ తర్వాత వరుసకు పెదనాన్న, మోహన్ స్నేహితుడు ఇళయరాజా, మరో ఇద్దరు సైతం బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇందుకు సహకరించిన బాలిక పెద్దమ్మను అరెస్ట్ చేసి, నిందితుల్లో ఐదుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story