Mon Dec 23 2024 06:58:22 GMT+0000 (Coordinated Universal Time)
పొలం లో పని చేసుకుంటున్న యల్లప్ప.. ఇంతలో
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్పపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఎలుగుబంటిని దాడిలో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పరుగులు తీసింది.
పొలం పనులకు వెళుతున్న రైతు యల్లప్పపై ఎలుగు బంటి దాడి చేసింది. దాడిని పసిగట్టిన గ్రామస్తులు కేకలు వేయగా అడవిలోకి వెళ్ళిపోయింది ఎలుగుబంటి. రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో 108 లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొలేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగు బంటి దాడుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడు ఏ ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుందో తెలియదని బాధను వ్యక్తం చేస్తున్నారు రైతులు.
Next Story