Mon Dec 23 2024 13:54:02 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి
అమెరికాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లూసియానాలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు
అమెరికాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లూసియానాలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇంటర్ స్టేట్ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నూట యాభైకి పైగా వాహనాలు పొగమంచు కారణంగా ఒకదానికొకకటి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగింది.
పొగమంచు కారణంగా...
న్యూ ఓర్లానో సమీపంలోని పాంట్ చార్లైయిన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలిలో భారీగా కార్లు, వాహనాలు పడి ఉన్నాయి. సహాయ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. దాదాపు అరగంట సేపు ఈ వాహనాలు ఒక దానిని ఒకటి ఢీకొట్టాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Next Story