Thu Dec 26 2024 12:05:08 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. వ్యవసాయకూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు.
వ్యవసాయ పనులకు వెళుతుండగా...
కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన పన్నెండు మంది వ్యవసాయకూలీలు పనికోసం ఆటోలో వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంజనమ్మ, బాలగద్దయ్య, నాగమ్మ, డి.నాగమ్మలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story