Mon Dec 23 2024 13:52:55 GMT+0000 (Coordinated Universal Time)
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతుండగా నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెంవద్ద ఈ ప్రమాదం జరింది.
పెళ్లికి హాజరై....
ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దాక్, సమీర్, యాసిన్ లు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. హైదరాబాద్ లో వివాహానికి హాజరయి తిరిగి వెళుతుండగా కారు డివైడర్ ను ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. మంచులో కన్పించక డివైడర్ ను ఢీకొన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story