Mon Dec 23 2024 10:21:56 GMT+0000 (Coordinated Universal Time)
పదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. విచారణలో వెలుగుచూసిన నిజాలు
వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చి, బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యపరీక్షల్లో బాలికపై అత్యాచారం
సూరత్ : అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు ఆగట్లేదు. క్షణికానందం కోసం.. చిన్నారుల జీవితాలను సొంత అన్నదమ్ములు, బాబాయి, మామ, ఆఖరికి తండ్రే చిదిమేస్తున్నాడు. కన్నకూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో వెలుగుచూసింది. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. 10 ఏళ్ల బాలిక తన ఇద్దరు తమ్ముళ్లతో ఇంట్లో ఉంటోంది. కుటుంబం పనికోసం సూరత్ కు వలస వెళ్లింది. పనికి వెళ్లిన తల్లి ఇంటికి తిరిగొచ్చే సరికి.. బాలిక రక్తపుమడుగులో పడి ఉంది.
వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చి, బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యపరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలగా.. పోలీసులు బాలికను జరిగిందంతా చెప్పాలని అడిగారు. బాలిక చెప్పిన దానిని బట్టి.. నేపాల్ కు చెందిన గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసినట్లు భావించారు. కానీ.. వారి ఇంటికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా ఆ సమయంలో తన తండ్రి, మామయ్య ఇంటికి వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించాడు. కూతురిపై తానే అత్యాచారం చేసి, తన గురించి పోలీసులకు, వైద్యులకు చెప్పవద్దని బెదిరించినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు బాలిక తండ్రి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.
Next Story