Mon Dec 23 2024 10:55:23 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రిని పక్కింటి ఆంటీతో ఏకాంతంగా చూసిన బాలుడు.. భయంతో ఆ తండ్రి దుర్మార్గం
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లా బరోఠా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగరాదా గ్రామంలో డిసెంబర్ 4న తన తండ్రి (45) సమీప..
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది అవే తప్పులు చేస్తూ.. తమ కుటుంబాలనే బలితీసుకుంటున్నారు. పక్కింటి ఆంటీతో తండ్రిని ఏకాంతంగా చూసిన కొడుకుని.. తండ్రే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వారంరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లా బరోఠా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగరాదా గ్రామంలో డిసెంబర్ 4న తన తండ్రి (45) సమీప బంధువైన, పక్కింట్లో ఉండే ఆంటీతో ఒకే గదిలో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను బాలుడు(15) చూశాడు. అది గమనించిన బాలుడి తండ్రి ఐదేళ్లుగా సాగిస్తున్న తమ అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డాడు. కడుపు తీపి గుర్తులేకుండా.. అతికిరాతకంగా కొడుకుని హతమార్చాడు. చేతులు నరికేసి 400 అడుగుల బోరుబావిలో పడేశాడు. మృతదేహాన్ని పొలాల వద్ద పొదల్లో పడేశాడు.
నాలుగు రోజుల తర్వాత గత మంగళవారం పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అంతకుముందే కొడుకుపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తండ్రిని అనుమానించారు. అతడిని ప్రశ్నించగా.. తనకేమీ తెలిదన్నట్లు బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయాన్ని చెప్పాడు. తన అక్రమ సంబంధం బయటపడుతుందన్న ఆందోళనతోనే ఈ హత్యచేసినట్లు అంగీకరించాడు. తండ్రిని, హత్యకు సహకరించిన ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
Next Story