Mon Dec 23 2024 18:31:05 GMT+0000 (Coordinated Universal Time)
కూతురికి నాలుగేళ్లుగా నరకం చూపిస్తున్న తండ్రి
చివరికి తన వల్ల కాక ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించి.. తన గోడు వెళ్లబోసుకుంది. సొంత మనుషులు, పరాయి మనుషులన్న..
కూతురికి కొండంత అండంగా ఉండాల్సిన తండ్రే.. ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఎవరికి చెప్పుకోవాలో.. ఏమని చెప్పుకోవాలో.. చెబితే నమ్ముతారో లేదోనన్న భయంతో తండ్రి ఎంత హింసించినా భరించింది ఆ బాలిక. చివరికి తన వల్ల కాక ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించి.. తన గోడు వెళ్లబోసుకుంది. సొంత మనుషులు, పరాయి మనుషులన్న తేడా లేదు. ఆడపిల్లలకు బయటే కాదు.. సొంతింట్లోనూ రక్షణ లేకుండా పోతోంది. తాత, తండ్రి, బాబాయ్, అన్న, మామయ్య ఇలా.. ఎవరొ ఒకరు ఆడపిల్లల్ని వేధిస్తున్నారు. నాలుగేళ్లుగా ఓ తండ్రి కూతురిని వేధిస్తున్న ఘటన శ్రీ సత్య సాయి జిల్లా, మడకశిర నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
నాలుగేళ్లుగా కన్న కూతురిని శారీరకంగా హింసిస్తున్నాడు ఆ సైకో తండ్రి. తండ్రి పెట్టే బాధలు భరించలేక.. శనివారం (జులై 1) రాత్రి ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించి.. జరిగింది వివరించింది. ఆ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story