Mon Dec 23 2024 08:08:46 GMT+0000 (Coordinated Universal Time)
ఘోరం : టిఫిన్ ఆలస్యమయిందని కోడలికి మరణశిక్ష
వెంటనే తన లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా..
థానే : టిఫిన్ ఆలస్యంగా చేసిందన్న నెపంతో కోడలికి మరణశిక్ష విధించాడు మామ. టిఫిన్ పెట్టేంతవరకూ ఓపిక పట్టలేని మామ రివాల్వర్ తో ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. సీమా రాజేంద్ర గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తోంది. ఆమె మామ కాశీనాథ్ పాటిల్ (76) ఓ వ్యాపారవేత్త. కాశీనాథ్ తనకు కోడలు సమయానికి టిఫిన్ పెట్టలేదని కోపంతో రగిలిపోయాడు.
వెంటనే తన లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం ఉదయం సీమా మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story