వేధిస్తున్నాడని మామను చంపేసిన కోడలు.. ప్లాన్ వేరే అంటున్న గ్రామస్థులు
మామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అలాంటిది అతడే కోడలిపై తన కామవాంఛ తీర్చుకోవాలని భావిస్తే.. విసుగుచెందిన కోడలు మామని పైలోకాలకు పంపించింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూర్ లో దారుణం జరిగింది.
మామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అలాంటిది అతడే కోడలిపై తన కామవాంఛ తీర్చుకోవాలని భావిస్తే.. విసుగుచెందిన కోడలు మామని పైలోకాలకు పంపించింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూర్ లో దారుణం జరిగింది. లైంగికంగా వేధిస్తున్న మామ రాములును కోడలు చంద్రకళ చితకబాదింది. తీవ్రంగా గాయపడ్డ నెంబర్ రాములును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మామ లైంగిక వేధింపులను సెల్ ఫోన్ లో చిత్రీకరించిందా కోడలు. రాములు కుమారుడు అదే గ్రామానికి చెందిన చంద్రకళను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. కుమారుడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కోడలు మీద కన్నేసిన మామ రాములు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొడుకు మానసిక స్థితిని అవకాశంగా తీసుకొని కోడలిని లైంగికంగా ఉపయోగించుకోవాలని కుట్రపన్నాడు. అయితే చంద్రకళ వేధింపులను భరించలేక మామ రాములుపై దాడి చేసింది. గాయపడిన రాములును వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పటికే రాములు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. మామను చంపడానికి చంద్రకళ సోదరుడు కూడా సహాయం చేశాడు.
అయితే, ఈ ఘటనపై బంధువులు చెప్పేది భిన్నంగా వుంది. కేవలం ఆస్తి కోసమే మామను కోడలు చంపిందంటున్నారు బంధువులు. దీంతో చంద్రకళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆస్థి కోసమే కోడలు చంద్రకళ హత్యచేసిందని రాములు బంధువులు ఆరోపిస్తున్నారు. రాములు ఆస్తిని కాజేయడానికే చంద్రకళ కులాంతర వివాహం చేసుకుందని రాములు బంధువులు ఆరోపిస్తున్నారు. మంగళవారం నాడు చంద్రకళ తల్లి ఇంటిపైనా, మరికొందరు బంధువుల ఇళ్లపైనా రాములు కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. గొడవల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.