Mon Dec 23 2024 11:05:12 GMT+0000 (Coordinated Universal Time)
కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిన తండ్రి.. అసలు విషయమేంటి ?
కానీ స్వాతి అందుకు ససేమిరా కుదరదని చెప్పింది. ఈ విషయమై పలుమార్లు తండ్రి-కూతురి మధ్య గొడవలు జరిగాయి.
కూతురు వేరు కులం లేదా మతం వాడిని ప్రేమించిందనో, పెళ్లి చేసుకుందనో కారణాలతో ఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని తెలిసిన తండ్రి.. కోపం పట్టలేక రోకలి బండతో కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లిలో స్వాతి (18) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవడంతో స్వాతి ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో స్వామి ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో.. తండ్రి గుర్రప్ప ఆమెను మందలించాడు. ఆ అబ్బాయిది వేరే కులమని.. అతడిని మరిచిపోవాలని చెప్పాడు.
కానీ స్వాతి అందుకు ససేమిరా కుదరదని చెప్పింది. ఈ విషయమై పలుమార్లు తండ్రి-కూతురి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అతడిని ప్రేమించడం మానేయాలని గుర్రప్ప చెప్పగా.. అందుకు స్వాతి నిరాకరించింది. కూతురు ఎదురుచెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గుర్రప్ప.. పక్కనే ఉన్న రోకలిబండతో స్వాతి తలపై బలంగా మోదాడు. దాంతో స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, గుర్రప్పను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story