Mon Dec 23 2024 12:57:28 GMT+0000 (Coordinated Universal Time)
సూట్ కేసులో అమ్మాయి శవం : వీడిన మిస్టరీ, తండ్రే హంతకుడు
ఇటీవల మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో సర్వీసు రోడ్డు పక్కన ఓ సూట్ కేసులో యువతి మృతదేహం లభ్యమవడం ..
ఎన్నో కలలతో బిడ్డల్ని కని.. పెంచి, చదివించి ప్రయోజకులను చేస్తున్న తల్లిదండ్రులు.. వారు ప్రేమించారనో, కులాంతర లేదా మతాంతర వివాహాలు చేసుకున్నారన్న కారణంగా.. చంపడానికి కూడా వెనుకాడటం లేదు. అంతటి దారుణ నిర్ణయాలు తీసుకునే ముందు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందని కనీసం ఆలోచన కూడా చేయట్లేదు. ఫలితంగా పిల్లల్ని చంపిన తండ్రులు జైలు పాలవుతుంటే.. అటు కన్న బిడ్డలు లేక.. ఇటు భర్త తోడు లేక దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య తర్వాత.. అలాంటి హత్యోదంతాలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి దారుణం వెలుగుచూసింది.
ఇటీవల మధురలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలో సర్వీసు రోడ్డు పక్కన ఓ సూట్ కేసులో యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆ యువతిని కన్నతండ్రే హత్య చేసినట్లు తేలింది. ట్విస్ట్ ఏంటంటే.. కూతుర్ని చంపి.. సూట్ కేస్ లో కుక్కడానికి భార్య అతనికి సహకరించడం. మృతురాలిని ఆయుషి చౌదరిగా గుర్తించారు. కులాంతర వివాహం చేసుకోవడమే ఆ యువతి ఉసురు తీసింది.
మరో సామాజిక వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే యువకుడ్ని ప్రేమించి వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి నితీష్ యాదవ్ ఆయుషిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం భార్య సాయంతో కుమార్తె మృతదేహాన్ని ఓ సూట్ కేసులో కుక్కి యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్ద పడేశాడు. హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఫోన్ డేటాను పరిశీలించి తండ్రి నితీష్ యాదవ్ హంతకుడిగా తేల్చారు. అతడిని అరెస్ట్ చేసి, లైసెన్స్ డ్ తుపాకీని స్వాధీనం చేరుకున్నారు.
Next Story