Mon Dec 23 2024 06:46:23 GMT+0000 (Coordinated Universal Time)
రెండేళ్ల కొడుకుని కొట్టిచంపిన తండ్రి
నేరేడ్ మెట్ జేజే నగర్లోని ఎస్ఎస్.బి క్లాసిస్ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు దివ్య, సుధాకర్
మద్యంమత్తులో తండ్రి రెండేళ్ల కొడుకుని కొట్టిచంపిన ఘటన నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేరేడ్ మెట్ జేజే నగర్లోని ఎస్ఎస్.బి క్లాసిక్ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు దివ్య, సుధాకర్ దంపతులు. వీరిద్దరూ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కొడుకు జీవన్ ఉన్నాడు. సోమవారం రాత్రి కొడుకు ఏడుస్తుండగా.. ఏడవద్దని వారించాడు సుధాకర్.
అప్పటికే మద్యం సేవించి ఉన్న సుధాకర్ ను కొడుకు ఏడుపు విసుగు తెప్పించింది. మద్యం మత్తులో విచక్షణ లేకుండా తీవ్రంగా చితకబాదాడు. మధ్యలో అడ్డొచ్చిన తల్లి దివ్యను పక్కకు తోసేశాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన జీవన్ ను తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. తల్లి దివ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని సుధాకర్ కోసం గాలిస్తున్నారు.
Next Story