Sun Dec 22 2024 15:56:29 GMT+0000 (Coordinated Universal Time)
రెండో భార్యతో గొడవ.. కొడుకుని కత్తితో పొడిచి చంపిన తండ్రి
మొదటి భార్య చనిపోవడంతో.. శశిపాల్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య కొడుకుని చూసుకోవడంలో రెండో..
మొదటి భార్యకు పుట్టిన కొడుకు వల్ల రెండో భార్యతో గొడవలు వస్తుండటంతో.. అతడిని అడ్డుతొలగించుకునేందుకు కన్నతండ్రే అంతమొందించాడు. రెండో భార్య కాపురానికి రావట్లేదని ఈ దారుణానికి తెగబడ్డాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిందీ దారుణం. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ లోని తేజాజీ నగర్ ఏరియాలో శశిపాల్ ముండే (26) నివాసముంటున్నాడు. అతని మొదటి భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. వారికి ఏడేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు.
మొదటి భార్య చనిపోవడంతో.. శశిపాల్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి భార్య కొడుకుని చూసుకోవడంలో రెండో భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. పిల్లాడిని తాను చూసుకోలేనని తేల్చి చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ పిల్లాడు ఇంట్లో ఉన్నంతవరకూ తాను కాపురానికి రాబోనని స్పష్టం చేసింది. రెండో భార్య చేష్టలకు విసిగిపోయిన శశిపాల్.. కొడుకును అడ్డుతొలగించుకోవాలని భావించి.. అతడిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న శశిపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story