కన్నకూతురిని గొంతుకోసి చంపిన తండ్రి
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కన్న కూతురిని ఓ తండ్రి కడతేర్చాడు.
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కన్న కూతురిని ఓ తండ్రి కడతేర్చాడు. వివరాళ్లోకెళితే.. చందానగర్ బీహెచ్ఈఎల్లోని జ్యోతి స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్న కూతురు మోక్షజ(9)ను తండ్రి చంద్రశేఖర్ కిరాతకంగా హత్య చేశాడు. కూతురిని స్కూల్ నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన తండ్రి చంద్రశేఖర్.. బ్లేడ్‌తో గొంతుకోసి చంపేశాడు. ఆపై పాప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పెద్దఅంబర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద కారు ప్రమాదంతో హత్యోదంతం బయటపడింది.
కొన్నాళ్లుగా భార్య హిమతో విడిపోయి దూరంగా ఉంటున్న నిందితుడు చంద్రశేఖర్.. మూడు రోజులకు ఒకసారి వచ్చి పాపను చూసి వెళ్తుంటాడు. నాలుగున్నర గంటల సమయంలో ఓఆర్ఆర్ పైకెక్కిన నిందితుడు చంద్రశేఖర్.. ఓఆర్ఆర్పై కారుతో డివైడర్‌ను ఢీ కొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పాప మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.