Sun Dec 22 2024 21:57:17 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాక్టర్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. ఎవరు బలయ్యారంటే?
కాలు గుర్జర్ తన తమ్ముడికి చెందిన పొలంలో ట్రాక్టర్‌ను
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో అన్నదమ్ముల మధ్య గొడవ చివరికి ప్రాణాలు తీసుకునే దాకా వెళ్ళింది. గ్రామంలో ట్రాక్టర్‌తో విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి తన సొంత అన్నయ్యను కాల్చి చంపాడు. నిందితుడు కరువా గుర్జర్ తన అన్న కాలు గుర్జర్ (34) ను చంపేయడమే కాకుండా.. మృతదేహాన్ని దహనం చేయడానికి ప్రయత్నించాడు. అయితే హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో కరువా గ్రామం నుండి పారిపోయాడు.
దొరవలి గ్రామంలో మంగళవారం సాయంత్రం కాలు గుర్జర్ తన తమ్ముడికి చెందిన పొలంలో తన ట్రాక్టర్‌ను నడిపాడు. కరువా గుర్జార్ తన పొలంలో ట్రాక్టర్ ఎందుకు నడిపావు అంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్తా పెద్దదైంది. కరువా తన అన్నయ్యను తుపాకీతో కాల్చడంతో ఛాతీలోకి తూటా దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు కాలు గుర్జర్‌ను చికిత్స కోసం గ్వాలియర్‌కు తరలించారు, అయితే అతను మార్గమధ్యంలో మరణించాడు. కరువా గుర్జర్ హడావిడిగా తన అన్న దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. అయితే హత్య విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న నిందితుడు అక్కడ నుండి పారిపోయాడు. పోలీసులు కాలు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు.
Next Story