Sun Apr 13 2025 06:34:35 GMT+0000 (Coordinated Universal Time)
కుస్తీ పోటీలు ఓ వైపు.. పహిల్వాన్ల గొడవ మరోవైపు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం పరస్పర దాడులకు దారి తీసింది. స్టేడియంలోని జనం మధ్య ఈ గొడవ జరిగింది. ఒక పక్క మ్యాచ్ జరుగుతూ ఉండగా.. మరోపక్క ఇద్దరు పహిల్వాన్లు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దాడులతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
ఎల్బీస్టేడియంలో మోదీ కేసరి దంగల్ కుస్తీ పోటీలు నిర్వహించుకున్నారు. మ్యాచ్ జరుగుతుండగా ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు పహిల్వాన్లు, వారితో పాటు వచ్చిన ఇరువర్గాల సభ్యులు కూడా గొడవకు దిగారు. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓ వైపు పహిల్వాన్లు.. మరోవైపు వారి పక్కన ఉన్న అనుచరులు దాడికి దిగారు. ఘటనకు సంబంధించి మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. స్థానికులు, పోటీలు నిర్వహించిన నిర్వహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి ఇరు వర్గాలకు చెందిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
Next Story