Sun Dec 22 2024 16:30:40 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమె రక్తనమూనాల్లో డ్రగ్స్ వినియోగించినట్లు తేలడంతో ఆమెకు పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. తొలిసారి నోటీసులు ఇచ్చినా హేమ తనకు వైరల్ ఫీవర్ ఉందని చెప్పి హాజరు కాలేదు. దీంతో రెండోసారి నోటీసులు ఇచ్చారు.
ఈరోజు విచారణకు...
అయితే ఈరోజు విచారణకు రావడంతో నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరందరూ డ్రగ్స్ వినియోగించినట్లు పరీక్షల్లో తేలింది. రేవ్ పార్టీ జరిగిన తర్వాత డ్రగ్స్ ను విక్రయించిన వారిని కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. హేమతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story