Sun Dec 22 2024 16:23:10 GMT+0000 (Coordinated Universal Time)
సినీనటి హేమకు బెయిల్.. షరతులు ఇవే
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమకు బెయిల్ లభించింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమకు బెయిల్ లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొద్ది రోజుల క్రితం సినీనటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భంగా రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ వినియోగించారని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ చేయడంతో...
తర్వాత ఆమెను విచారణకు పిలిపించి అరెస్ట్ చేశారు. అయితే హేమ తరుపున న్యాయవాది హేమ నుంచి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని, డ్రగ్స్ తీసుకున్నట్లు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 86 మందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని పోలీసులు నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story