Sat Jan 11 2025 02:07:26 GMT+0000 (Coordinated Universal Time)
భార్య మీద నుండి కారుతో దూసుకెళ్లిన నిర్మాత.. ఎందుకు చేశాడంటే..?
సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రా తన కారుతో భార్యను గుద్దేశాడు. ఆమె మీద నుండి వాహనాన్ని పంపించడానికి ప్రయత్నించాడు. అతడి వాహనంలో మరో మహిళను గమనించిన భార్య నిలదీయడానికి వస్తూ ఉండగా.. అతడు భార్యను తన కారుతో ఢీకొట్టాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. సబర్బన్ అంధేరి (పశ్చిమ)లోని నివాస భవనం పార్కింగ్ ప్రాంతంలో అక్టోబర్ 19న జరిగిన ఈ ఘటనలో కమల్ మిశ్రా భార్య గాయపడినట్లు పోలీసు అధికారి తెలిపారు.
అంబోలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, చిత్ర నిర్మాత భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. కమల్ మిశ్రా భార్య తన భర్త కోసం వెతుకుతున్నప్పుడు పార్కింగ్ ప్రాంతంలో అతని కారులో మరో మహిళతో కలిసి కనిపించింది. భార్య అతనిని అడ్డుకోడానికి వెళ్ళినప్పుడు, కమల్ మిశ్రా అక్కడి నుండి తప్పించుకోవడానికి కారును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో అతని భార్యను ఢీకొట్టాడు, ఆమె కాళ్ళు, చేతులు తలపై గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, కమల్ మిశ్రాపై అంబోలిలో 279 (రాష్ డ్రైవింగ్) మరియు 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యతో గాయపరచడం) సహా ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.
Next Story