Mon Dec 23 2024 15:32:15 GMT+0000 (Coordinated Universal Time)
షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
దర్శి పట్టణంలోని అభి షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా..
ఇటీవల కాలంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల తిరుపతితో ఓ ఫొటోఫ్రేమ్స్ వర్క్ షాపులో అగ్నిప్రమాదం జరగ్గా.. భారీగా ఆస్తినష్టం జరిగింది. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి లోని ఓ షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
దర్శి పట్టణంలోని అభి షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలుముకుంది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో రూ.2 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story