Mon Dec 23 2024 08:29:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పుట్టిన రోజు.. యువతి సజీవ దహనం
బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది, యువతి సజీవ దహనం అయింది
బెంగళూరులో నిన్న రాత్రి విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూం మొత్తం అగ్ని ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో షోరూం అకౌంటెంట్ ప్రియ సజీవ దహనమయింది.
క్యాబిన్ లో ఇరుక్కుని...
ప్రియ వయసు ఇరవై ఏళ్లు. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. అయితే ఈరోజు ప్రియ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి ఉంది. కానీ అగ్ని ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఆమె ఊపిరాడక ప్రాణాలు విడిచింది. షోరూంలో ఎలాంటి అగ్ని ప్రమాదం నివారణకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రియ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story