Mon Dec 23 2024 09:30:38 GMT+0000 (Coordinated Universal Time)
మంటల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అందరూ ..
హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అందరూ బస్సు నుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమవ్వడంతో.. ప్రయాణికుల లగేజీ మొత్తం తగలబడిపోయింది. ప్రమాదానికి గురైన బస్సు మోజో ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నట్లు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చే ఏర్పాటు చేశారు.
Next Story