Mon Dec 23 2024 03:04:46 GMT+0000 (Coordinated Universal Time)
Rajasthan : రాజస్థాన్లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
రాజస్థాన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు
రాజస్థాన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మంటల్లో చిక్కుకుని ఐదుగురు మరణించగా, చాలా మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
నలుగురికి పరిస్థితి...
సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎన్ఎంెస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికకులు పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్ పేలి మంటలు వ్యాపించడంతో వారు తప్పించుకోలేకపోయారని అధికారులు చెబుతున్నారు.
Next Story