Mon Dec 23 2024 16:41:06 GMT+0000 (Coordinated Universal Time)
రూబీ హోటల్ పై ఫైర్ డిపార్ట్ మెంట్ కీ రిపోర్ట్
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ విషాదంపై అగ్నిమాపక శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ విషాదంపై అగ్నిమాపక శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మూడు పేజీల ఈ నివేదికలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. నిన్న రాత్రి 9.15 గంటలకు ప్రమాదం జరిగితే పదిహేను నిమిషాల తర్వాత ఫైర్ డిపార్ట్ మెంట్ కు హోటల్ మేనేజర్ ఫోన్ చేశారని పేర్కొంది. లిథియం బ్యాటరీ పేలుళ్ల కారణంగానే దట్టమైన పొగలు వ్యాపించాయని పేర్కొంది. అందువల్లే అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారని తెలిపింది.
ఒకే ఎంట్రీ...
ఇక భవనానికి ఒకే ఒక ఎంట్రీ ఉందని, ఎగ్జిట్ కూడా అదేనని చెప్పింది. లిఫ్ట్ పక్కన మెట్లు ఉండకూడదన్న నిబంధనను హోటల్ యాజమాన్యం పట్టించుకోలేదని నివేదికలో తెలిపింది. అగ్నిమాపక పరికరాలు ఉన్నా అవి పనిచేయలేదని పేర్కొంది. భవనం మొత్తం క్లోజ్ సర్క్యూట్ లో ఉండి పోయిందని చెప్పింది. ఫైర్ డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవడానికి కనీసం క్యారిడార్ కూడా లేదని నివేదికలో తెలిపింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పింది. హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. మంటలు మొదటి అంతస్థు వరకే వ్యాపించాయని తెలిపింది.
Next Story