Mon Dec 23 2024 09:02:47 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో.. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన
సిద్ధిపేట : తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈసారి కూడా భూ వివాద విషయంలోనే కాల్పులు జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో.. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతికి సంబంధించిన వ్యక్తులు వంశీకృష్ణ అనే వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
కాగా.. వంశీకృష్ణ గతంలో ఒగ్గు తిరుపతిపై కత్తితో దాడి చేయగా.. ఇప్పుడు తిరుపతి అతనిపై కాల్పులు జరిపించినట్లు సమాచారం. ఓ భూమి విషయానికి సంబంధించి కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీపీ శ్వేత.. ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story