Mon Dec 23 2024 01:39:46 GMT+0000 (Coordinated Universal Time)
కాల్పుుల జరిపిన బీజేపీ ఎమ్మెల్యే.. పరిస్థితి ఉద్రిక్తం
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల జరిపిన ఘటన కలకలం రేపింది.
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల జరిపిన ఘటన కలకలం రేపింది. శివసేన ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండే వర్గానికి చెందిన గణ్‌పత్ గైక్వాడ్ కు మరో నేత మహేశ్ గైక్వాడ్ కు మధ్య గత కొంతకాలంగా భూవివాదం జరుగుతుంది. మహేశ్ గైక్వాడ్ కూడా శివసేనకు చెందిన నేత. ఈ స్థల వివాదంలో ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
స్థల వివాదంలో...
ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. గణ్‌పత్ గైక్వాడ్ మహేశ్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహేశ్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story