Sun Dec 22 2024 21:39:52 GMT+0000 (Coordinated Universal Time)
Encounter : మావోలకు కోలుకోలేని దెబ్బ.. తెలుగు అధికారి ఆపరేషన్ ను ముందుండి?
ఛత్తీస్గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి
ఛత్తీస్గడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. 29 మంది మావోయిస్టులు మరణించారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జవాన్లకు ఈ ఎదురుకాల్పుల్లో గాయాలయ్యాయి. బస్తర్ రీజియన్ లోని కాంకేర్ జిల్లాలో చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ కు తెలుగు ఐపీఎస్ అధికారి నేతృత్వం వహించడం విశేషం. తెలుగు రాష్ట్రానికి చెందిన ఇందిర కల్యాణ్ ఈ ఆపరేషన్ ను ముందుండి నడిపారు.
అగ్రనేత శకంర్ రావుతో...
ఈ ఎన్కౌంటర్ లో కాంకేర్ అగ్రనేత శంకర్రావు సహా 29 మంది మావోయిస్టుల మృతి చెందారు. శంకర్రావు తో పాటె సుమారుగా 29 మంది మావోయిస్టులు చనిపోయారు. శంకర్ పై 25 లక్షల రివార్డు ఉంది. వీరి వద్ద ఏడు ఏకే 47 తుపాకులు, మూడు ఎంఎంజీలు, ఒక ఇన్సాస్ రైఫిల్ సహా, పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ భారీ ఎన్కౌంటర్ జరగడంతో మావోలు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయని భావించి భద్రతా బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
Next Story