Tue Nov 05 2024 16:42:15 GMT+0000 (Coordinated Universal Time)
సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్
10 రోజుల తర్వాత 16వ తేదీన గ్రామ పెద్దలు, గ్రామస్తుల అండతో.. పోలీసులకు జరిగిన దారుణంపై బాధిత బాలిక తండ్రి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (కోనసీమ జిల్లా) కాట్రేనికోన మండలం చిర్రయానాం గ్రామంలో ఈ నెల 6వ తేదీన మైనర్ పై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. తోటలో మంచినీటి కోసం వెళ్లిన బాలికపై ఐదుగురు యువకులు కన్నేసి.. పట్టపగలే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చాక జరిగిన విషయం తండ్రికి చెప్పగా..పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించాడు.
10 రోజుల తర్వాత 16వ తేదీన గ్రామ పెద్దలు, గ్రామస్తుల అండతో.. పోలీసులకు జరిగిన దారుణంపై బాధిత బాలిక తండ్రి ఇల్లంగి కామేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అమలాపురం DSP మాధవ రెడ్డి, ముమ్మిడివరం CI జానకిరామ్, కాట్రేనికోన ఎస్సై టి.శ్రీనివాస్ లు విచారణ చేపట్టి 17న నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు ఓలేటి బ్రహ్మతేజ (20), ఓలేటి తులసీరావు (21), ఓలేటి ధర్మారావు(21), మల్లాడి వంశీ (20), అర్థాని వీరబాబు (21) లను అరెస్ట్ చేసి ముమ్మడివరం కోర్టులో హాజరు పరిచారు. ఐదుగురు నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
కాగా.. నిందితుల్లో గ్రామ సర్పంచ్ ఓలేటి మంగాదేవి - వైసీపీ నేత నాగేశ్వరరావుల కొడుకు తేజ కూడా ఉండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబాన్ని బెదిరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. గ్రామంలోనే పంచాయతీ నిర్వహించి బాలిక కుటుంబానికి లక్ష పరిహారం ఇచ్చేలా తీర్మానించారని సమాచారం. కానీ.. విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. బయటకు పొక్కడంతో ఎస్పీ సుధీర్ కుమార్ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని అమలాపురం DSP మాధవ రెడ్డి, ముమ్మిడివరం CI జానకిరామ్ లను ఆదేశించారు. ఆ తర్వాత బాలిక తండ్రి ఫిర్యాదుతో విచారణ చేసి.. నిందితుల్ని అరెస్ట్ చేశారు. బాలికకు ముమ్మిడివరం ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు.
Next Story