Mon Dec 23 2024 12:15:48 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి
లఖింపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై ఓ స్కూటీని కారు ఢీ కొట్టింది. కారులో స్కూటీ ఇరుక్కుపోయింది.
యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖింపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై ఓ స్కూటీని కారు ఢీ కొట్టింది. కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. ఆ రెండు వాహనాలను వేరు చేసేందుకు పాదచారులు ప్రయత్నిస్తుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బలంగా ఢీ కొట్టింది. దాంతో ఐదుగురు పాదచారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కొందరికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story