Mon Dec 23 2024 12:20:43 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారిపై సామూహిక అత్యాచారం.. విచారణలో విస్తుపోయే నిజాలు
వెంటనే విషయాన్ని జిల్లా బాలల భద్రతాధికారికి తెలియజేసింది. సమాచారం అందుకున్న అధికారి వెంటనే చిన్నారిని..
2వ తరగతి చదువుతోన్న చిన్నారిపై నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించడంతో.. ఆ చిన్నారి మిన్నకుండిపోయింది. చిన్నారికి ఇటీవల అస్వస్థతగా ఉండటంతో.. అసలు విషయం వైద్య పరీక్షల్లో తేలింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని విళుపురం జిల్లా జానకీపురంలో వెలుగుచూసింది. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న చిన్నారి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. ఏం జరిగింది అని మహిళా టీచర్ ఆరా తీయగా.. బాలిక లైంగిక దాడికి గురైనట్లు తెలిసి షాకైంది.
వెంటనే విషయాన్ని జిల్లా బాలల భద్రతాధికారికి తెలియజేసింది. సమాచారం అందుకున్న అధికారి వెంటనే చిన్నారిని ముండియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా.. నలుగురు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఘటనపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. బాలిక నివసించే ప్రాంతంలోనే ఉండే 14-17 ఏళ్ల లోపు నలుగురు మైనర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. కేవలం ఈ బాలిక మాత్రమే కాకుండా.. మరో నలుగురు చిన్నారులపై కూడా బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దాంతో పోలీసులు నలుగురు యువకులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story