Fri Nov 22 2024 16:08:34 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రవాదుల దాడి : ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరిపత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.
జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరిపత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్ పర్యటన ఖరారైన కొద్ది గంటల్లోనే ఈ దారుణానికి తెగబడ్డారు. జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న లష్కరే తోయిబా అనుంబంధ సంస్థ అయిన యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దారుణానికి తెగబడినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో ఐదుగురు భారత జవాన్లు మరణించగా, మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి.
పూంచ్ వెళుతుండగా...
ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించినట్లుగానే ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరి సెక్టర్లోని భీంబేర్గలీ నుంచి పూంచ్ వెళుతున్న ఆర్ఆర్యూ జవనాట్ల ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈదాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. వారి కోసం వెతుకులాట ప్రారంభమయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉగ్రమూకలను భారత సైన్యం గుర్తించ లేకపోయిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Next Story