Fri Nov 22 2024 21:34:11 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. వైద్యం వికటించి 5 నెలల గర్భిణీ మృతి
గర్భిణీని పరిశీలించిన వైద్యులు.. ఆమెకు వైద్యం చేశారు. కానీ కొద్దిసేపటికే వైద్యం వికటించడంతో ఐదునెలల గర్భిణీ
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. వైద్యం వికటించడంతో.. ఐదు నెలల గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో చోటుచేసుకుంది. స్థానిక ప్రశాంతి ఆస్పత్రిలో జరిగిందీ దారుణం. వివరాల్లోకి వెళ్తే.. శివాని అనే గర్భిణీని వైద్యం కోసం చౌటుప్పల్ లోని ప్రశాంతి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.
గర్భిణీని పరిశీలించిన వైద్యులు.. ఆమెకు వైద్యం చేశారు. కానీ కొద్దిసేపటికే వైద్యం వికటించడంతో ఐదునెలల గర్భిణీ అయిన శివాని మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే.. శివాని చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
News Summary - Five Months Pregnant Woman Passed Away of Medical Malpractise
Next Story