Fri Dec 20 2024 16:38:14 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : పెళ్లి బస్సు దగ్దం.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తర్ప్రదేశ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒక పెళ్లి బస్సు దగ్దం అయింది.
ఉత్తర్ప్రదేశ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒక పెళ్లి బస్సు దగ్దం అయింది. ఈరోజు ఘాజీపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తగలడం వల్లనే పెళ్లి బస్సు దగ్దమయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ముప్ఫయి మంది అందులో ఉండగా అందులో ఐదుగురు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని...
గాయపడిన వారిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వారి వివరాలను త్వరలోనే చెబుతామని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెళ్లి బస్సు దగ్దమయిన ఘటనలో ఐదుగురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story