Sun Dec 22 2024 22:21:50 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident at palnadu: ఓటు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా...బస్సును ఢీకొన్న టిప్పర్... చెలరేగిన మంటలు... ఐదుగురి సజీవదహనం
ఒక ప్రయివేటు బస్సు ట్రావెల్స్ దగ్దం కావడంతో ఐదుగురు సజీవదహమయిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
Private travels bus accident: ఒకప్రైవేట్ బస్సు ట్రావెల్స్ దగ్దం కావడంతో ఐదుగురు సజీవదహమయిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన ఓటు వేయడానికి వెళ్లిన వాళ్లు అనంత లోకానికి వెళ్లిపోయారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా మంగళవారం రాత్రి అరవిందప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నలభై మంది ప్రయాణికులు హైదరాబాద్కు బయలుదేరారు. వీళ్లంతా తమ ఓట్లు వేసి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి.
నలభై మంది ప్రయాణికులు...
ఈ మంటలకు బస్సులో గాఢనిద్రలో ఉన్న నలుగురు ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్ కూడా బలయ్యాడు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం నలభై మంది ప్రయాణికులున్నారు. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెంకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. నిన్న అర్థరాద్రి 1.30 గంటలకు చిలకలూరిపేట అన్నంభొట్లవారిపాలెం వద్ద కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు.
గాయపడిన వారిని...
మరికొందరు గాయపడ్డారు. అందరూ నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా టిప్పర్ ఢీకొని మంటలు చెలరేగడంతో బయటకు కొందరు కిటికీల నుంచి దూకేసే ప్రయత్నం చేశారు. మరికొందరు సురక్షితంగా బయటపడినా గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story